Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది. యశస్వి జైస్వాల్ (47; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్ (52; 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ధ్రువ్ జురెల్ (33; 15* బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్) రాణించినా మిగతా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, సిరాజ్, డేవిడ్ విల్లీ ఒక్కో వికెట్ పడగొట్టారు.
మ్యాక్స్‌వెల్ (77; 44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), డు ప్లెసిస్ (62; 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో తొలుత బెంగళూరు భారీ స్కోరు సాధించింది. ఒకానొక దశలో ఆర్సీబీ సులువుగా 220 స్కోరు సాధించేలా కనిపించింది. కానీ, మ్యాక్స్‌వెల్, డు ప్లెసిస్ వరుస ఓవర్లలో ఔట్ కావడంతో బెంగళూరు ఇన్నింగ్స్ గాడితప్పింది. చివరి ఏడు ఓవర్లలో ఆర్సీబీ.. 7 వికెట్లు కోల్పోయి 54 పరుగులే చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్, చాహల్ ఒక్కో వికెట్ తీశారు.