Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూజిలాండ్: న్యూజిలాండ్ దేశంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. కెర్మాడెక్ దీవుల ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. న్యూజిలాండ్ సమీపంలోని కెర్మాడెక్ దీవుల ప్రాంతంలో సోమవారం భారీ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్జిఎస్) తెలిపింది.10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు యూఎస్జీఎస్ అధికారులు చెప్పారు. భూకంపం తర్వాత అమెరికా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.గత నెలలో న్యూజిలాండ్ దేశంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో కెర్మాడెక్ దీవులను తాకింది.