Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్షకు సోమవారం ఉదయం 8 గంటల నుంచి 28 అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. www.tslprb.com వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. కానిస్టేబుల్ (సివిల్) ఉద్యోగాలకు ఈ నెల 30న ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఐటీ అండ్ సీవో ఉద్యోగాలకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలుంటాయని వివరించింది. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో సమస్యలుంటే support@tslprb.in మెయిల్‌కు లేదా 9393711110, 9391005006 నంబర్లను సంప్రదించాలని బోర్డు సూచించింది.