Authorization
Sun April 13, 2025 04:26:09 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: మేఘాలయలోని పశ్చిమ కాశీ కొండల్లో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 7.47 గంటలకు పశ్చిమ కాశీ హిల్స్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నామని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. కాగా, మేఘాలయాలో ఆదివారం సాయంత్రం 3.33 గంటలకు కూడా భూకంపం వచ్చింది. సౌత్ గారో హిల్స్‌లో 3.5 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. అదేవిధంగా ఏప్రిల్ 16న మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లో 3.6 తీవ్రతతో భూకంపం వచ్చిందని తెలిపింది.