Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై: తమిళనాడులో ఐటీ సోదాల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఐటీ అధికారులు సోమవారం ఉదయం నుంచి 50 ప్రాంతాల్లో బృందాలుగా సోదాలు నిర్వహించారు. ఇక, తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యుల ఇళ్లలో, అధికార డీఎంకే నేతలు, జీ స్వ్కేర్ కంపెనీ రియల్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అన్నానగర్ డీఎంకే ఎమ్మెల్యే మోహన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాగా, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.