Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
రెజ్లింగ్ క్రీడాకారులు మళ్లీ రోడ్డెక్కారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు వివరాల్ని వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ వరుసగా రెండో రోజు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో బ్రిజ్‌భూషణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసేంత వరకు తమ ఆందోళన విరమించబోమంటున్నారు. తమ ఆందోళన మద్దతిచ్చేవారు ఎవరైనా తమతో పాటు ధర్నాలో కూర్చోవచ్చని, ఈసారి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాం. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఏ పార్టీ అయినా సరే మాకు మద్దతిచ్చి దీక్షలో కూర్చోవచ్చు. అయితే, మాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు’’ అని పునియా వివరించాడు. ‘‘గతంలో నిరసన చేపట్టినప్పుడు మమ్మల్ని తప్పుదోవ పట్టించారు. ఈసారి మేం ఎవర్నీ గుడ్డిగా నమ్మబోం. కేసు నమోదు చేసేంత వరకు దీక్ష కొనసాగుతుంది అని వినేశ్ ఫొగాట్ తెలిపింది.