Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పరీక్షలు రద్దు, వాయిదా సబబేనని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వ్యవహారంలో కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం నేడు విచారణ జరిసింది. సిట్ దర్యాప్తుపై రాజకీయ ఒత్తిడి, మంత్రి కేటీఆర్ జోక్యం ఉంది. మంత్రి చెప్పినట్లే సిట్ దర్యాప్తు చేస్తోంది. ఐటీ అంశాలపై దర్యాప్తునకు సిట్‌లో సాంకేతిక నిపుణులు లేరు’’ అని కోర్టుకు తెలిపారు. విచారణలో భాగంగా ఇప్పటివరకు సిట్ 40 మంది సాక్షులను ప్రశ్నించిందని ప్రభుత్వం తరఫున హైకోర్టుకు ఏజీ తెలిపారు. 12 కంప్యూటర్లను సిట్ సీజ్ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ తరుణంలో ధర్మాసనం స్పందిస్తూ సిట్‌లో ఐటీ నిపుణులు ఉన్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఐటీ అంశాల దర్యాప్తునకు మళ్లీ ఔట్ సోర్సింగ్‌కు వెళ్తారా? అని వ్యాఖ్యానించింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఎందుకు విచారణకు పిలిచారు? నేతల నుంచి ఏదైనా సమాచారం సేకరించారా? అని కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ఈ నెల 28న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది.