Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం 1పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ ముగిసింది. దీనిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ను ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌కు సూచించింది. త్వరగా విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ఏపీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీల ర్యాలీలు, ధర్నాలు జరపడాన్ని నిషేదిస్తూ జీవో నంబర్ 1 ను ఏపీ ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ ముగించి ఏపీ హైకోర్టు సీజే బెంచ్ తీర్పు వాయిదా వేసింది. హైకోర్టులో తీర్పు జాప్యం క్రమంలో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించగా నేడు విచారణ జరుపుతామని సీజేఐ తెలిపారు. ఈ మేరకు నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు జీవో నం1పై కీలక ఆదేశాలు జారీ చేసింది.