Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: డిస్కౌంట్లో వచ్చే ఓ చీర కోసం ఇద్దరు మహిళలు కొట్టుకున్నారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉండే మైసూరు సిల్క్ శారీ సెంటర్ ఇటీవల డిస్కౌంట్ ధరలతో ఇయర్లీ శారీ సేల్ నిర్వహించింది. బయట మార్కెట్ కంటే తక్కువ ధర ఉండటం, చీరలు కూడా బాగుండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు మహిళలు ఆ దుకాణానికి క్యూ కట్టారు. తమకు నచ్చిన చీరలను బుట్టలో వేసుకోవడం మొదలు పెట్టారు. అందులో ఇద్దరు మహిళలకు ఒకే చీర నచ్చింది. అంతే, ఇంకేముంది.. ఆ చీర నాకు కావాలని ఒకరంటే.. కాదు నాకు కావాలి అని మరో మహిళ గొడవకు దిగారు. అది కాస్తా ముదిరి ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకునేవరకు వెళ్లారు. వారిని అదుపు చేసేందుకు అక్కడున్న సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్గా మారింది.