Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఊరటను సవాల్ చేస్తూ వివేకా కూతురు సునీతారెడ్డి సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అవినాష్‌రెడ్డికి మళ్లీ ఊరట ఇచ్చిన సుప్రీం.. పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా వేసింది. సునీత పిటిషన్ ఆధారంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధిస్తూనే.. అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీం కోర్టు బెంచ్ సోమవారానికి(ఏప్రిల్ 24వ తేదీకి) వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో సునీత పిటిషన్‌పై ఇవాళ లంచ్ తర్వాత మధ్యాహ్న సమయంలో సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.