Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లక్నో
యూపీలోని ప్రయాగరాజ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ కుమార్ సింగ్ నగరంలోని ఓ హోటల్ రూంలో సీలింగ్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. సోమవారం ఉదయం ప్రయాగరాజ్‌లోని విఠల్ హోటల్లో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాఫీ హౌస్ వద్ద విఠల్ హోటల్ ఉంది. అంటువ్యాధుల నిరోధక విభాగానికి సునీల్ కుమార్ సింగ్ నోడల్ అధికారిగా నియమితులయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.