Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ-చేర్యాల
మండలంలో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి వరి పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రైతులకు భరోసా కల్పించారు. చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి,పెద్దరాజుపేట గ్రామాల్లో వడగండ్ల వర్షానికి నష్టపోయిన వరి పంటలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 2 వేల ఎకరాల వరి పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమగ్ర పంట పరిశీలన చేసిన అనంతరం నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వ పక్షాన నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల సర్పంచ్ లు కత్తుల కృష్ణవేణి, నూనె వెంకటేశం, ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, ఏడిఏ రాధిక, ఎంపీటీసీ గూడూరు బాలరాజు, కొమురవెల్లి తహసిల్దార్ లక్ష్మీనారాయణ, చేర్యాల ఆర్ఐ రాజేందర్ రెడ్డి, బాధిత రైతులు పాల్గొన్నారు.