Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో దేశంలో జనాభా పెరుగుదలపై ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. బారామతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అజిత్ పవార్ మాట్లాడుతూ జనాభా నియంత్రణ క్రమంలో ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలున్న వారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లోనూ అటువంటి వారిని పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన జనాభా 35 కోట్లు. ఇప్పుడు 142 కోట్లకు చేరుకుంది. దీనికి మనందరం బాధ్యత అని తన తాత చెప్పేవారని, ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదలను అన్ని రాజకీయ పార్టీలు సీరియస్గా తీసుకోవాలన్నారు. మన దేశం, రాష్ట్రం, జిల్లా బాగుండాలంటే ఒకరిద్దరు పిల్లలకే పరిమితం కావాలన్నారు. ఇద్దరికి మించి సంతానం ఉన్న వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని తెలిపారు. దీంతో ప్రజల్లో ఈ సమస్యపై మరింత అవగాహన పెరుగుతుందని అన్నారు.