Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గత మూడేళ్లుగా ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టులో పిటిషన్ వేసింది ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆర్టీసీలో యూనియన్ల గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికలు నిర్వహించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ఆర్టీసీ, ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ యూనియన్ లీడర్ అశ్వధ్ధామా రెడ్డి కోరారు.