Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: బోరబండలోని బంజారానగర్లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతి గొంతు కోశాడు ఓ ప్రేమోన్మాది. సురేష్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా లక్ష్మీ అనే యువతి వెంటపడుతున్నాడు. అయితే యువకుడి ప్రేమను లక్ష్మీ నిరాకరించింది.
ఈ క్రమంలో సోమవారం స్కూటీపై వెళ్తున్న యువతిని అడ్డగించిన సురేష్.. ఒక్కసారిగా గొంతుపై కత్తితో దాడి చేశాడు. దీంతో లక్ష్మీ గట్టిగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న కొంతమంది ప్రేమోన్మాదిని అడ్డుకున్నారు. నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకొని.. ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ప్రేమోన్మాది దాడిలో యువతికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.