Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుపతి
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. మే, జూన్ నెలకు సంబంధించిన ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఉదయం 10గంటలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in లో మాత్రమే దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది.