Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పట్నా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట లభించింది. మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్పై బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ 2019లో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు రాహల్ను ఏప్రిల్ 12న కోర్టు ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించింది. అయితే తాను సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసే పనిలో ఉన్నానని, కోర్టుకు హాజరుకాలేనని రాహుల్ తెలిపారు. ఈ తరుణంలో న్యాయస్థానం అందుకు అంగీకరించింది. ఏప్రిల్ 25న హాజరుకావాలని చెప్పింది.