Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో వైఎస్సార్ కడప జిల్లాకు ఎస్పీగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మను సీబీఐ అధికారులు నేడు విచారించారు. నాడు, వివేకా హత్య జరిగిన అనంతరం నియమించిన సిట్ బృందంలో రాహుల్ దేవ్ శర్మ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో, సీబీఐ నేడు ఆయనను విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ దేవ్ శర్మ నుంచి సీబీఐ అధికారులు ఇవాళ్టి విచారణ సందర్భంగా కీలక సమాచారం సేకరించారు. వివేకా కేసుకు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని రాహుల్ దేవ్ శర్మ సీబీఐకి సమర్పించారు. వివేకా ఇంట్లో లభించిన ఆధారాలపై సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో దాదాపు 2 గంటలపాటు ఈ విచారణ జరిగింది.