Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ సూపర్ బౌలింగ్ తో అదరకొట్టాడు. గత ఆరు మ్యాచ్ ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన సుందర్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి ఢిల్లీని తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు. దాంతో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక, సన్ రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 28 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు సాధించాడు. ఢిల్లీ టీంలో మనీశ్ పాండే (27 బంతుల్లో 34), అక్షర్ పటేల్ (34) మినహా మిగిలిన వారు విఫలం అయ్యారు.