Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమె మే 8 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న షర్మిలతో సహా మరో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. ఏ1గా వైఎస్ షర్మిల, ఏ2గా కారు డ్రైవర్ బాలు , ఏ3 గా మరో డ్రైవర్ జాకబ్‌ల పేర్లు నమోదు చేశారు. వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలూ పని చేస్తారని, అలాంటి వారిపై చేయి చేసుకోవడం వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. షర్మిల తన కారు డ్రైవర్‌ను వేగంగా పోనివ్వాలని చెప్పారని, ఈ క్రమంలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు కాలికి గాయాలయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరో మహిళా కానిస్టేబుల్‌తోపాటు, ఎస్సై పైనా షర్మిల చేయి చేసుకున్నారని కోర్టుకు వివరించారు.