Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ: తెలుగు రాష్ట్రాల మధ్య త్వరలో నీటి విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ కేంద్రంగా వీటిని నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉడాన్ పథకంలో భాగంగా నీటి విమానాశ్రయం (వాటర్ ఏరోడ్రోమ్)గా సాగర్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏరోడ్రోమ్ నిర్మాణానికి మొదటి విడతగా రూ.20 కోట్లను విడుదల చేసింది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ సాగర్ ఏరోడ్రోమ్‌పై సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి శ్రీశైలం, విజయవాడకు సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, నాగార్జునసాగర్‌ను వాటర్ ఏరోడ్రోమ్‌గా అభివృద్ధి చేసేందుకు మూడేళ్లుగా కృషి చేశానని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.