Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: ఎయిరిండియా తన డిజిటల్ వ్యవస్థలను ఆధునికీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చాట్‌జీపీటీ ఆధారిత చాట్‌బాట్ వినియోగించనుంది. ఇప్పటికే ప్రాథమిక పెట్టుబడుల కింద 200 మి. డాలర్ల (దాదాపు రూ.1600 కోట్ల)ను వెచ్చించింది. కంపెనీ రూపురేఖలను మార్చడం కోసం విహాన్.ఏఐ పేరిట ఒక పథకాన్ని ఎయిరిండియా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కొత్త డిజిటల్ వ్యవస్థలు, డిజిటల్ ఇంజినీరింగ్ సేవల కోసం 200 మి.డాలర్ల పెట్టుబడులు పెట్టింది. పరిశ్రమలోనే అత్యుత్తమ డిజిటల్ సిబ్బందిని కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ప్రపంచస్థాయి విమానయాన సంస్థల సరసన నిలిచేందుకు వచ్చే అయిదేళ్లలో మరిన్ని పెట్టుబడులు కొనసాగించనుందని అంచనా. సంప్రదాయ డిజిటల్ సాంకేతికత మొదలు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. పరిశ్రమలో కొన్ని సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్లను సైతం వినియోగించాలని అనుకుంటోంది.