Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇండోనేషియా
ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపానికి పశ్చిమాన మంగళవారం రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. ఈ భూకంపంతో ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ సునామీ హెచ్చరికను జారీ చేసింది. ఇండోనేషియాలో గతంలోనూ 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భూకంపం 84 కిలోమీటర్ల లోతులో వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు.
సునామీ హెచ్చరికలతో సుమత్రా దీవుల్లో తీరప్రాంత వాసులు సముద్ర తీరానికి దూరంగా ఉండాలని ఇండోనేషియా అధికారులు కోరారు. పశ్చిమ సుమత్రా రాజధాని పడాంగ్‌లో భూకంపం తీవ్రంగా ఉందని, దీంతో ప్రజలు బీచ్‌లకు దూరంగా ఉన్నారని పడాంగ్‌లో ఉన్న అధికార ప్రతినిధి అబ్దుల్ ముహారి చెప్పారు.సునామీ ముప్పుతో సముద్ర తీరప్రాంత వాసులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.