Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉత్తర్ప్రదేశ్
ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న 85 ఏళ్ల వృద్ధురాలిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఎంత బతిమాలినా కనికరం చూపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హమీర్పుర్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బిన్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ 85 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె కుమారుడు ఉపాధి కోసం ఢిల్లీ వెళ్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. అదే గ్రామానికి చెందిన భూర శివరే అని వ్యక్తి బాధితురాలి ఇంటి వెనుక నుంచి దొంగతనంగా వచ్చి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె ఎంత బతిమాలినా వినలేదు. తర్వాతి రోజు ఉదయం ఈ విషయం తెలుసుకున్న స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి.. బాధితురాలిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వృద్ధురాలి ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అయితే, నిందితుడిపై ఇదివరకే పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు.