Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు నేడు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం సూచీలపై కనిపిస్తోంది. ఉదయం 9.28 సమయంలో సెన్సెక్స్ 31 పాయింట్ల నష్టంతో 60,024 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 17,728 వద్ద ట్రేడవుతున్నాయి. మిర్జా ఇంటర్నేషనల్, జొమాటో, గ్లాండ్ ఫార్మా, రైల్ వికాస్ నిగమ్, ఇండియా బుల్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. క్రామ్టన్ గ్రీవ్స్, ఇప్కా ల్యాబొరేటరీస్, ఈకేఐ ఎనర్జీ సర్వీస్, బ్రైట్‌కామ్ గ్రూప్, సింధూ ట్రేడ్ లింక్ షేర్ల ధరలు కుంగాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిసిన ప్రభావం వీటిపై పడింది. నిన్నటి ట్రేడిండ్‌లో అమెరికాలోని నాస్డాక్ సూచీ 0.29శాతం తగ్గగా.. డోజోన్స్ సూచీ 0.2శాతం, ఎస్అండ్పీ 500 సూచీ 0.09శాతం పతనమైంది. జపాన్‌కు చెందిన నిక్కీ మాత్రమే 0.54శాతం లాభాల్లో ఉంది. దక్షిణ కొరియా, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉండగా.. చైనా సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.