Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
దేశ రాజధానిలోని 13 లక్షల మంది నిర్మాణ కార్మికులపై కేజ్రీవాల్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఢిల్లీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గ్రూప్ ఇన్సూరెన్సు, హాస్టళ్ల సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. 75 శాతం రాయితీపై ఇళ్లనూ అందించనుంది. సోమవారం ఢిల్లీలో కార్మికశాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో కేజ్రీవాల్ ఈ నిర్ణయాలను ప్రకటించారు. ఢిల్లీ భవన, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులందరికీ ఈ సౌకర్యాలు వర్తిస్తాయని ఆయన చెప్పారు. బోర్డు ద్వారా 400, 500 మందికి పథకాలను వర్తింపజేస్తే ప్రయోజనం లేదని, మొత్తం 13 లక్షల మందికి వర్తింపజేయాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది జూన్‌లోగా ఎంత మంది కార్మికులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారో తేల్చాలని ఆదేశించారు. 60ఏళ్లు దాటిన కార్మికులను వారంలోగా గుర్తించాలని, వారందరికీ పింఛన్లు ఇద్దామని చెప్పారు.