Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లికి భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2023లో భాగంగా ఏప్రిల్ 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు (స్లో ఓవర్ రేట్) ఉల్లంఘించినందుకు గాను, అతనితో పాటు ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ (ఇంపాక్ట్ ప్లేయర్‌తో పాటు) కంతా భారీ జరిమానా పడింది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆర్సీబీ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేయడం రెండోసారి కావడంతో కెప్టెన్‌కు 24 లక్షలు, జట్టు సభ్యులకు 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం (రెంటిలో ఏది ఎక్కువైతే అది) కోత విధించినట్లు మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ వెల్లడించారు. ఈ పరిస్థితి మరోసారి రిపీట్ అయితే, ఆర్సీబీ కెప్టెన్‌గా ఎవరు ఉన్నా అతనిపై ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది. ప్రస్తుత ఐపీఎల్లో 24 లక్షల జరిమానా పడిన తొలి కెప్టెన్ విరాట్ కోహ్లినే. ఇదిలా ఉంటే, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (62), మ్యాక్స్‌వెల్ (77) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 189 పరుగులు చేయగా,. ఛేదనలో తడబడిన ఆర్ఆర్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి, ఓటమిపాలైంది.