Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఢిల్లీ కేపిటల్స్‌తో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ఢిల్లీ నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికలపడిన హైదరాబాద్ ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. బౌలింగులో ఆ జట్టు రాణించినప్పటికీ బ్యాటింగ్‌లో చతికిలపడి మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ అయిడెన్ మార్కరమ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గెలవాలన్న ఉత్సాహం, తపన తమ జట్టులో కనిపించలేదన్నాడు. బ్యాటింగులో దారుణంగా విఫలమయ్యామని అన్నాడు. దురదృష్టవశాత్తు.. గెలవాలన్న ఉత్సాహం లేని జట్టుగా తాము కనిపిస్తున్నట్టు చెప్పాడు. ఒకసారి వెనక్కి వెళ్లి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఓ జట్టుగా లక్ష్యాన్ని మరింత మెరుగ్గా ఎలా ఛేదించవచ్చన్న విషయాన్ని చర్చించుకోవాలని, ఈ సీజన్లో ముందడుగు వేసేందుకు అది తమకు ఉపయోగపడొచ్చని అన్నాడు. తమ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, మంచి బ్యాటర్లు ఉన్నారని, అయితే దురదృష్టవశాత్తు తమలో గెలవాలన్న పట్టుదల కొరవడిందని మార్కరమ్ ఆవేదన వ్యక్తం చేశారు.