Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేరళ
దేశంలోనే తొలిసారిగా కేరళలోని కొచ్చిలో వాటర్ మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సర్వీసులను నేడు ప్రారంభించనున్నాయి. రాష్ట్రంలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
అంతే కాకుండా జర్మనీతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టామని, తొలిదశ పనులు పూర్తయ్యాయని, మంగళవారం నుంచి సర్వీసులను నడిపిస్తామని వివరించారు. కొచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లోని పది దీవులను కలుపుతూ 78 విద్యుత్ బోట్లను తిప్పుతామని విజయన్ వివరించారు. రాష్ట్ర పర్యాటక రంగంలో ఈ వాటర్ మెట్రో విప్లవాత్మక మార్పులకు కారణమవుతుందని, పర్యాటకానికి బూస్ట్ లా పనిచేస్తుందని పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు.