Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మంచిర్యాల
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. బైక్ పై వెళుతున్న ఓ యువకుడిని ఓ కుంటుంబం బండరాయితో కొట్టి చంపేసింది. రాయితో తలను ఛిద్రమయ్యేలా కొట్టడంతో మహేశ్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. వీధిలో అందరూ చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. ఈ భయానక సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీశాడు. చుట్టూ జనం ఉన్నా కూడా ఒక్కరు కూడా ఈ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయకపోవడం వీడియోలో కనిపిస్తోంది.
ఇందారం గ్రామానికి చెందిన ఓ వివాహితను మహేశ్ కొంతకాలంగా వేధిస్తున్నాడని, అదే ఈ హత్యకు దారితీసిందని ప్రాథమిక సమాచారం. వివాహితకు మహేశ్ అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతున్నాడని తెలుస్తోంది. దీనిపై వివాహిత కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా మహేశ్ వేధింపులు ఆగకపోవడంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఈ దారుణానికి తెగబడినట్లు తెలుస్తోంది. మంగళవారం బైక్ పై వెళుతున్న మహేశ్ పై దాడి చేశారు. కిందపడ్డ మహేశ్ ను బండరాయితో కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. పదే పదే తలపై రాయితో మోదడంతో మహేశ్ అక్కడికక్కడే చనిపోయాడు. వేధింపులకు గురైన వివాహిత తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఈ హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు.