Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మిర్యాలగూడ
మిర్యాలగూడలో గత రాత్రి డ్రంక్ డ్రైవ్ సందర్భంగా పోలీసుల మీదకు కారును పోనిచ్చారు. ఈ తరుణంలో కారును ఆపేందుకు ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. తప్పతాగిన కొందరు మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లైఓవర్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు చెబుతున్నా వినకుండా ముందుకు కారును పోనిచ్చారు. కానిస్టేబుల్ లింగారెడ్డిని 50 మీటర్ల దూరం ఈడ్చుకుపోయారు. ఆపై అక్కడి నుంచి పరారయ్యారు. గాయాల పాలైన కానిస్టేబుల్ లింగారెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లింగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన వన్‌టౌన్ పోలీసులు పరారైన వాళ్ల కోసం గాలింపు చేపట్టారు.