Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతతెలంగాణ - మంచిర్యాల
జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. ఊరంతా చూస్తుండగానే ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. ముస్కె మహేష్(28) అనే వ్యక్తి బైక్‌లో పెట్రోల్ కొట్టించుకుని వస్తున్న తరుణంలో అడ్డగించిన ఆ నలుగురు దాడికి దిగారు. గొంతు కోసి ఆపై బండ రాయితో తల పగలకొట్టారు.
అయితే ఇందారం గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, మహేష్‌కు నడుమ గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. ఆపై ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆ యువతి తల్లి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో మహేష్ ఫోన్ ద్వారా అసభ్య మెసేజ్‌లతో వేధిస్తుండడంతో ఆ కుటుంబం భరించలేకపోయింది. ఎంత చెప్పినా అతని తీరు మారలేదు. దీంతో వివాహిత తన తల్లిదండ్రులు, సోదరుడితో మాటువేసి ఈ ఉదయం మహేష్‌ను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.