Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లఖ్‌నవూ
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రాణహాని చేస్తామంటూ బెదిరింపులు రావడం రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీంతో ఆ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ బెదిరింపులు ‘112’ నంబరుకు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఈ నంబరును ఆ రాష్ట్ర పోలీసు విభాగం అత్యవసర సర్వీసులకు వినియోగిస్తోంది. దుండగుడు ఈ నంబరుకు కాల్ చేసి త్వరలో సీఎంని హత్య చేస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపుతో 112 ఆపరేషన్ కమాండర్ సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రిహాన్ అనే వ్యక్తి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.