Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ తరుణంలో బీజేపీ నేత తాజాగా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక బీజేపీ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ ఒక మతాన్ని కించపరిచారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదని దురుసు వ్యాఖ్య చేశారు. సోమవారం శివమొగ్గలో వీరశైవ, లింగాయత్‌ల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మత మార్పిళ్లపై ప్రసంగిస్తూ ఈశ్వరప్ప పరుషంగా మాట్లాడారు.