Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. రెండు ష్యూరిటీలు, రూ. 30 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. నిన్న కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన వెంటనే ఆమె తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే, బెయిల్ పిటిషన్ పై ఈరోజు విచారణ చేపడతామని కోర్టు నిన్న తెలిపింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై షర్మిల చేసుకున్నారని, ఆమెపై పలు కేసులు కూడా ఉన్నాయని, ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని పోలీసుల తరపు లాయర్లు వాదించారు. అయినప్పటికీ కోర్టు ఆమెకు షరతులతో కూడిని బెయిల్ మంజూరు చేసింది.