Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మెల్బోర్న్
ఆస్ట్రేలియాలో ఐదుగురు కొరియన్ మహిళలకు మత్తమందు ఇచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నేరాన్ని కెమెరాలో రికార్డు చేసిన కేసులో భారత సంతతి వ్యక్తిని దోషిగా నిర్ధారించారు. బాలేష్పై అన్ని నేరారోపణలు రుజువు కావడంతో సిడ్నీలోని జిల్లా కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. అన్ని కేసుల్లోనూ నిందితుడిని దోషిగా కోర్టు ప్రకటించిన వెంటనే 43 ఏండ్ల డేటా నిపుణుడు బాలేష్ కోర్టు ప్రాంగణంలో కంటతడి పెట్టుకున్నాడు.
మేలో మరోసారి కోర్టు ఎదుట బాలేష్ ధన్కర్ హాజరు కానుండగా ఏడాది చివరిలో అతడికి విధించే శిక్షను ఖరారు చేస్తారు. మహిళలను లోబరుచుకునేందుకు ధన్కర్ కొరియన్ ట్రాన్స్‌లేటర్లు కావాలంటూ నకిలీ ఉద్యోగ ప్రకటనలు ఇచ్చేవాడు. ఆపై వారిని సిడ్నీలోని తన స్టూడియో అపార్ట్‌మెంట్‌కు తీసుకువెళ్లేందుకు హోటల్, కేఫ్, కొరియన్ రెస్టారెంట్లో మహిళలతో సంప్రదింపులు జరుపుతుంటాడు. వైన్, ఇతర డ్రింక్స్‌లో మత్తు పదార్ధాలు కలిపి మహిళలకు ఆఫర్ చేసేవాడని ఆపై వారు స్ప్రహ కోల్పోగానే లైంగిక దాడికి పాల్పడేవాడని ప్రాసిక్యూటర్లు వివరించారు.