Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరువనంతపురం
దేశంలో కేరళలో తొలిసారి కొత్త మెట్రో వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. కోచి వాటర్ మెట్రో పేరుతో నీటిపై నడిచే మెట్రో సర్వీస్‌ను ప్రధాని మోడీ మంగళవారం జాతికి అంకితం చేశారు. అంతకుముందు ఆయన ఆ రాష్ట్రంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపారు.
ఇది తిరువనంతపురం నుంచి కాసరగోడ్ వరకు రాకపోకలు సాగిస్తుంది. అంతేగాకుండా డిజిటల్ సైన్స్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభాల్లో భాగంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు కేరళకు మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. అలాగే కోచిలో వాటర్ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేరళ విద్యావంతుల రాష్ట్రం. ఇక్కడి ప్రజల కృషి, వినయం వారి గుర్తింపులో భాగం. రాష్ట్రాల అభివృద్ధే దేశ ప్రగతికి మూలమని మా ప్రభుత్వం నమ్ముతోంది’ అని ప్రధాని తెలిపారు.