Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణాలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల హిందీ ప్రశ్నాపత్రం లీక్ అయిన కేసులో కరీంనగర్ ఎంపీ మరియు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. కాగా ఈ బెయిల్ ను రద్దు చేయాలనీ తెలంగాణ పోలీసులు పిటీషన్ వేశారు. బండి సంజయ్ కు ఉన్నపళంగా బెయిల్ ను రద్దు చేయాలనీ, పోలీసులకు ఆయన సహకరించడం లేదని, విచారణకు అవసరం అయిన ఫోన్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, అంతే కాకుండా బెయిల్ నిబంధనలను పక్కన పెట్టి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఈ పిటిషన్ లో పోలీసులు పొందుపరిచారు. కాగా ఈ పిటిషన్ కు సంబంధించిన వాదనలను విన్న హనుమకొండ కోర్ట్ దీనిపై విచారణను మళ్ళీ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మళ్ళీ బండి సంజయ్ ను జైలుకు పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మరి హనుమకొండ కోర్ట్ లో విచారణ జరిగి తీర్పు వచ్చే వరకూ ఈ విషయంపైన సందిగ్దత తొలగిపోదు.