Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియా విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ తాజాగా మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా అందులో ఆయనను నిందితుడిగా చేర్చింది. ఈ అనుబంధ ఛార్జ్‌షీట్‌లో సిసోదియాతో పాటు తెలుగు రాష్ట్రానికి చెందిన గోరంట్ల బుచ్చిబాబు, మరికొందరిని కూడా నిందితులుగా చేర్చింది.
ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీట్ ఇది. అంతకుముందు గతేడాది నవంబరులో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా అందులో ఏ1గా అప్పటి అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్సింగ్ను, ఏ2గా అప్పటి అబ్కారీశాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేందర్‌సింగ్, ఏ3గా విజయ్ నాయర్, ఏ4గా అభిషేక్ బోయిన్పల్లి పేర్లను చేర్చింది. వీరితో పాటు సమీర్ మహేంద్రు, రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్‌ను కూడా నిందితులుగా తెలిపింది.