Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబాబాద్
జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని చిలకోయలపాడులో సీసీ రోడ్ల శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు. ఈ తరుణంలో రెడ్యానాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటైన వాఖ్యలు చేశారు. రేవంత్ వాడు ఎక్కనుంచి వచ్చాడు తెలుగుదేశం నుంచి వచ్చాడు. రేవంత్ కాంగ్రెస్ ను ఉద్దరిస్తాడా.. కాంగ్రెసోల్లకు ఐక్యత లేదు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు అన్నారు. నేను కాంగ్రెస్ నుండే వచ్చాను. నాకు తెలుసు ఎవరు ఎలాంటి వారో. మళ్ళీ మూడోసారి ముచ్చటగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం’ అని రెడ్యా నాయక్ జోస్యం చెప్పారు. ఇన్ని రోజుల రాజకీయ చరిత్రలో నేను చేసిన అభివృధి తప్ప మరెవరైనా చేసారా. ఇప్పటివరకు కేసీఆర్ చేసిన పనులకు ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది అని అన్నారు.