Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ప్రపంచ సంగీత రంగంలో బీటీఎస్ ఓ ప్రభంజనంలా దూసుకొచ్చింది. సెలెబ్రిటీలు కూడా బీటీఎస్ ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి కాదు. అయితే, కెనడా నటుడు 22 ఏళ్ల సెయింట్ వాన్ కొలూస్సీ బీటీఎస్ సంగీత బృందంలోని జిమిన్ లా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుని ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. అచ్చం జిమిన్ లా కనిపించాలని కొలూస్సీ ఏకంగా 12 శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. అయితే చివరి ఆపరేషన్ వికటించడంతో ఆ కెనడా నటుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ నటుడు మ్యూజిక్ ఇండస్ట్రీలో కెరీర్ కోసం 2019లో దక్షిణ కొరియా వెళ్లాడు. తన రూపం కారణంగా దక్షిణ కొరియాలో అవకాశాలు రావేమోనని అతడు అభద్రతా భావానికి గురయ్యేవాడు. కొరియన్ల తరహాలో వీ షేప్ ముఖాకృతిలోకి తన ముఖాన్ని మార్చుకోవడంపై దృష్టి పెట్టాడు. ముఖ్యంగా, బీటీఎస్ గాయకుడు జిమిన్ లా తన ముఖాన్ని మార్చుకునేందుకు అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. గత నవంబరులో దవడల ఆకృతి మార్చేందుకు వైద్యులు కొన్ని ఇంప్లాంట్స్ ను శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. ఏప్రిల్ 22న ఆ ఇంప్లాంట్స్ ను తొలగించేందుకు సర్జరీ నిర్వహించారు. అయితే, కొలూస్సీ ఇన్ఫెక్షన్ కు గురై ప్రాణాలు విడిచాడు.