Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అహ్మదాబాద్: ఐపీఎల్ 2023లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిని గుజరాత్ జట్టు నిర్ణిత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 207పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో ముంబై జట్టుకు 208 పరుగుల భారీ టార్గెట్ ను నిర్ధేశించింది. గుజరాత్ బ్యాట్స్ మెన్లలో గిల్ (56) అర్ధ సెంచరీ చేయగా మిల్లర్ (46), అభినవ్ మనోహర్ (42) పరుగులు చేయగా చివర్లో రాహుల్ తేవాటియ 5 బంతుల్లో 20 పరుగులు చేయడంతో గుజరాత్ భారీ స్కోరు చేసింది.