Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 22న అదృశ్యమైన మహిళ
- కుళ్లిన స్థితిలో శవం లభ్యం
- దర్యాప్తు చేపట్టిన పోలీసులు
నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్ బ్యాంక్ కాలనీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందినట్లు నాల్గవ టౌన్ ఎస్ఐ సందీప్ తెలిపారు. బ్యాంక్ కాలనీకి చెందిన సంగం కస్తూరి (28) పాచి పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈనెల 22 నాడు రోజువారీగా తాను పనిచేసే ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కస్తూరి భర్త మల్లేష్ భార్య జాడకై చుట్టుపక్కల, బంధువుల ఇంట్లో వెతికిన జాడ లభ్యం కాలేదు. నాలుగో టౌన్ లో ఇచ్చి ఫిర్యాదు మేరకు ఎస్సై సందీప్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మంగళవారం సాయంత్రం బ్యాంక్ కాలనీలోని రమాదేవి వెంచర్ లోని ఓ ఇంటిలోని బాత్రూంలో మంగళవారం సాయంత్రం శవమై కనిపించింది. కాలనీ లోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న 4 టౌన్ ఎస్ఐ సందీప్ మృతదేహాన్ని పరిశీలించగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో క్లూస్ టీం నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ తెలిపారు. అయితే వివాహిత చనిపోయిన ఇంట్లో ఎవరు ఉండరని, ఇల్లు అమ్మకానికి పెట్టారని, సదరు మహిళ అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అనే కోణంలో విచారణ చేపడుతున్నామని ఆయన తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉంది.