Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
క్రికెట్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి మృతుడి తల్లి జయ, గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై అంజిబాబు తెలిపిన వివరాల మేరకు అనకాపల్లి జిల్లా దిబ్బపాలెం గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగరావు, జయల కుమారుడు మధుకుమార్ (20) అనకాపల్లిలోని ప్రయివేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
అయితే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్లో పాల్గొన్న ఈ విద్యార్థి ఇందుకోసం ఇదే గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగరావు వద్ద అప్పు చేశాడు. అప్పు తీర్చమని ఒత్తిడి రావడంతో ఈనెల 23న రాత్రి ఎలుకల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం విశాఖపట్నంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా మంగళవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అంజిబాబు తెలిపారు.