Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కరోనా కారణంగా మూడేళ్లపాటు నిలిచిపోయిన చేప ప్రసాదం పంపిణీని ఈ ఏడాది తిరిగి ప్రారంభిస్తున్నట్లు బత్తిని మృగశిర ట్రస్ట్ ప్రతినిధులు, బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ తరుణంలో మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రస్ట్ ప్రతినిధి బత్తిని అమర్నాథ్గౌడ్ ఆ వివరాలు తెలిపారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం తదితర దీర్ఘకాలిక శ్వాస సంబంధిత వ్యాధులకు 190 ఏళ్లుగా చేప ప్రసాదం అందిస్తున్నామన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జూన్ 9 ఉదయం 8 గంటల నుంచి జూన్ 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు.