Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల పంపకాలపై బుధవారం కీలక సమావేశం జరగనుంది. సమైక్య రాష్ట్రం విడిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఆస్తుల విభజన జరగలేదు. దీనిపై పలు దఫాలుగా చర్చలు జరిగినా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు.
ఈ తరుణంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో సమావేశం జరగనుంది. ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొననున్నారు.