Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భాగమతి బోటులో 40 మంది పర్యాటకులు ఉరుములు, ఈదురు గాలులకు చిక్కుకోవడంతో హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అప్రమత్తమైన బోట్ల సిబ్బంది అందరినీ విజయవంతంగా రక్షించి బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
భాగమతి బోటు మంగళవారం సాయంత్రం 5 గంటలకు బుద్ధ విగ్రహం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే, ఈదురు గాలులతో కూడిన భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీని కారణంగా పడవ అదుపు తప్పి మరో దిశలో కొట్టుకుపోవడంతో పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. పరిస్థితి అంచనా వేసిని సిబ్బంది వేగంగా పడవను ఒడ్డుకు చేర్చారు. వాతావరణం కారణంగా బోటు ఒక్కసారిగా పనిచేయడం మానేసింది.