Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిద్దిపేట
గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు దక్కింది. బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనీషియేటివ్ (బీఎఫ్హెచ్ఐ) న్యూఢిల్లీ గ్రేడ్-1 గుర్తింపు ఎన్నికైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పది పద్ధతుల ప్రకారం అప్పుడే పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు పట్టించడం, ముర్రుపాల ఉపయోగాలు, ఫీడింగ్ విధానాలు మెచ్చి ఈ గుర్తింపు ఇచ్చారు. ఈ తరుణంలో గజ్వేల్ ఆస్పత్రికి గ్రేడ్-1 అక్రెడిటేషన్ అందిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ తెలిపారు. అయితే ఈ గుర్తింపు 2026 వరకు కొనసాగుతుందని తెలిపారు.