Authorization
Sat April 12, 2025 11:36:23 am
నవతెలంగాణ - సిద్దిపేట
జిల్లాలోని పోచమ్మ ఆలయంలో భారీ చోరీ చోటుచేసుకుంది. ఆలయంలోకి చొరబడి హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో రోజూ మాదిరిగానే ఆలయ పూజారి అమ్మవారి గుడికి వచ్చాడు. అయితే ఆలయ తలుపులు తెరిచి ఉండటం చూసి షాక్ తిన్నాడు. ఆలయంలోని హుండీ చిందర వందరగా పడిఉండటం చూసి ఖంగుతిన్న పూజారి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆలయానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.