Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మియాపూర్ ఎస్సై, ఓ హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. మియాపూర్‌లో హాస్టల్ నిర్వహిస్తున్న తాండ్ర అశోక్‌కుమార్, లీల ప్రభు మీద లోకల్ పోలీసుస్టేషన్లో ఈ మధ్య ఓ కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నిందితులకు సహకరించడానికి రూ. 50 వేలు లంచం అడగాలని ఎస్సై యాదగిరిరావు హెడ్ కానిస్టేబుల్ డి.వెంకట్‌రెడ్డికి సూచించారు. దీంతో నిందితుడు అశోక్‌కుమార్‌ను హెడ్ కానిస్టేబుల్ రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ తరుణంలో దానికి అంగీకరించిన బాధితుడు సోమవారం సాయంత్రం హెడ్ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డికి రూ. 30 వేలు ఇచ్చాడు. ఈ పైసలను ఆయన ఎస్సై యాదగిరిరావుకు ఇచ్చారు. మిగతా రూ. 20 వేలను మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఆవరణలో బాధితుడు హెడ్ కానిస్టేబుల్‌కు ఇస్తుండగా అదే టైంలో అక్కడ ఉన్న ఏసీబీ రంగారెడ్డి జిల్లా రేంజ్ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఎస్సైని అరెస్టు చేశారు.